మెహబూబా మూవీతో టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించిన నేహా శెట్టి ఆ తర్వాత సినిమాలు చేసినప్పటికీ డీజే టిల్లు లో రాధికగా బాగా పాపులరైంది. ఇప్పటికీ అమ్మడిని చాలా మంది రాధిక అనే పిలుస్తున్నారు. నేహా శెట్టి ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో తన అందాల ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది. తాజాగా పారిస్ వెకేషన్ కు వెళ్లిన నేహా ఐఫిల్ టవర్ దగ్గర ఫోటోలకు పోజులిచ్చింది. వైట్ కలర్ మినీ ఫ్రాక్ లో బ్యాక్ అందాలు ఎలివేట్ అయ్యేలా వెనక్కి తిరిగి నవ్వుతూ నెటిజన్ల మది దోచుకుంటుంది నేహా.