ఢిల్లీలోని ఎయిమ్స్ సర్వర్ ను హ్యాకింగ్ వెనుక చైనా హస్తమున్నట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 5 సర్వర్లను చైనా టార్గెట్ గా చేసుకుందని అధికారులు పేర్కొంటున్నారు. హ్యాక్ చేసిన డేటాను డార్క్ వెబ్ లో విక్రయించి వుండొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో వీవీఐపీలతో పాటు సెలబ్రెటీల వివరాలు నిక్షిప్తమై వున్నాయని ఎయిమ్స్ అధికారులు తెలిపారు. అయితే… హ్యాకర్ల ప్రధాన డిమాండ్ డబ్బేనని, దీనిపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు. ఎయిమ్స్ సర్వర్ రెండు రోజుల క్రితం హ్యాక్ అయ్యింది. క్రిప్టో కరెన్సీ రూపంలో 200 కోట్లు కట్టాలని హ్యాకర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ డేటాలో 34 కోట్ల మంది రోగుల డేటా వున్నట్లు తెలిపారు.
ఎయిమ్స్ లో సర్వర్లు మొరాయించినట్లు గత నెల 23 న గుర్తించారు. ఆ తర్వాత హ్యాక్ అయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఎయిమ్స్ లో సర్వర్లు, కంప్యూటర్లకు యాంటీ వైరస్ సొల్యూషన్ ప్రక్రియ సాగుతోంది. ఈ ఆస్పత్రిలో మొత్తం 5 వేలకు పైగా కంప్యూటర్లు వుండగా… ఇప్పటి వరకూ 1200 కంప్యూటర్లకు యాంటీ వైరస్ ఎక్కించారు. 50 సర్వర్లలో మొత్తం 20 సర్వర్లకు స్కాన్ చేసినట్లు అధికారులు తెలిపారు.