ఇకపై మహారాజా ఆస్పత్రి పేరు కాస్త.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మార్పు..

ఏపీలో పేర్ల మార్పు ప్రక్రియ కొనసాగుతూనే వుంది. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును కాస్త వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా పేరు మార్చిన విషయం తెలిసిందే. తాజాగా.. జగన్ ప్రభుత్వం మరో సంస్థ పేరు మార్చేసింది. విజయనగరంలో ఎంతో చరిత్ర వున్న మహారాజా ఆస్పత్రి పేరును జగన్ ప్రభుత్వం మార్చేసింది. మహారాజా ఆస్పత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా పేరు మార్చేశారు. గురువారం రాత్రి మహారాజా ఆస్పత్రి బదులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా బోర్డు కనిపించింది. దీనిపై టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.

Related Posts

Latest News Updates