అమెరికాలో తెగ ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్- ఉపాసన… ఫొటోలు వైరల్

టాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ రామ్‌చరణ్‌ , ఉపాసన జంట ‘బేబీమూన్‌ ట్రిప్‌’(Babymoon Trip)ను ఎంజాయ్‌ చేస్తున్నారు.తాజాగా ఈ జంట అమెరికా వీధుల్లో సరదాగా చక్కర్లు కొట్టారు. షాపింగ్స్, డిన్నర్స్.. అంటూ అమెరికా వీధుల్లో ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘బేబీమూన్’ట్రిప్‌ అంటూ ఈ మెగా జంట సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. చరణ్‌ తోపాటు ఉపాసన సైతం యూఎస్‌ (Us) వెళ్లింది. అక్కడ చిత్ర ప్రమోషన్స్‌, ఇంటర్వ్యూలు అంటూ చరణ్‌ బిజీబిజీగా గడుపుతున్నారు.

Related Posts

Latest News Updates